Court Speed Up Yuzvendra Chahal and Dhanashree Divorce Plea: టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వరుసగా వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకోవాని వారు నిర్ణయించుకున్నారు, ఇప్పటికే కోర్టులో విడాకులపై పిటిషన్ కూడా వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనశ్రీ, చాహల్ విడివిడిగా జీవిస్తున్నట్టు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే విడాకులపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి వారి తీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
ఆమెతో చాహల్ డేటింగ్?
ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి తమ ఫోటోలు డిలిట్ చేశారు. ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ విడాకుల వార్తల నేపథ్యంలో చాహల్ ఓ అమ్మాయితో కనిపించడం ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరుతోంది. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో చాహల్ ఓ అమ్మాయితో కనిపించి షాకిచ్చాడు. ఇది చూసిన అంతా ఆమె ఎవరా అని ఆరా తీయగా ఆర్జే మహ్వాష్‌గా గుర్తించారు. ఆమెతో చాహల్ పీకల్లోతూ ప్రేమలో ఉన్నాడని గుసగుసల వినిపిస్తున్నాయి.
రేపు విడాకులపై తీర్పు
మరోవైపు ధనశ్రీ తరచూ సింగిల్ స్టేటస్, హార్ట్ బ్రేకింగ్ కోట్స్ పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి విడాకులకు సంబంధించిన మరో లేటస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. రేపే వారి విడాకులపై తుది తీర్పు రానుందని బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్‌పై రేపు తీర్పు ఇవ్వాలని ముంబై హైకోర్టు, ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పిరియడ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా.. ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. మార్చి 21 నుంచి చాహలో ఐపిల్‌తో బిజీ కానున్నాడు.
2020లో పెళ్లి
ఈ క్రమంలోనే రేపటిలోగా విడాకులపై తుది తీర్పు ఇవ్వాలని ముంబై హైకోర్టు ఫ్యామిలీని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఫ్యామిలీ కోర్టు గురువారం (మార్చి 20) చాహల్, ధనశ్రీ విడాకులపై తుది తీర్పు ఇవ్వనుందని తెలుస్తోంది. ఇక ధనశ్రీకి భరణం కింద రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాడట. కాగా యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీలు 2020లో పెళ్లి చేసుకున్నారు. యూట్యూబర్, డ్యాన్సర్ అయిన ధనశ్రీని చాహల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం డేటింగ్‌లో ఉన్న లాక్‌డౌన్ సమయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన ఐదేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుని విడిపోవడాన్ని వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.