Site icon Prime9

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌ కు గోల్డెన్ టిక్కెట్‌ అందజేసిన బీసీసీఐ సెక్రటరీ జైషా

Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Tendulkar:  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జైషా శుక్రవారం “గోల్డెన్ టిక్కెట్ ఫర్ ఇండియా ఐకాన్స్” కార్యక్రమంలో భాగంగా భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌ కు గోల్డెన్ టిక్కెట్‌ అందజేసారు.  భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ ఈ టికెట్ అందుకున్న రెండవ వ్యక్తి. అంతకుముందు, షా మంగళవారం ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గోల్డెన్ టిక్కెట్‌ను అందించారు. ‘X’ ద్వారా టికెట్ అందుకున్న రెండో వ్యక్తి సచిన్ అనే వార్తను బీసీసీఐ షేర్ చేసింది.

తరతరాలకు స్పూర్తి..(Sachin Tendulkar)

క్రికెట్ మరియు దేశానికి ఒక ఐకానిక్ క్షణం!మా “గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్” కార్యక్రమంలో భాగంగా, BCCI గౌరవ కార్యదర్శి @JayShah భారతరత్న శ్రీ @sachin_rtకి గోల్డెన్ టిక్కెట్‌ను అందించారు.క్రికెట్ శ్రేష్ఠత మరియు జాతికి గర్వకారణం..సచిన్ టెండూల్కర్ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు, అతను భాగం అవుతాడు@ICC @cricketworldcup 2023, యాక్షన్‌ని ప్రత్యక్షంగా చూస్తున్నారు” అని షా సచిన్‌కి టిక్కెట్‌ను అందజేస్తూ పోస్ట్ కు కాప్షన్ ఇచ్చారు.

ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరు గోల్లెన్ టిక్కెట్లు అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ ల మధ్య జరిగే మ్యాచ్ తో వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. ఇందులోఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగే మ్యాచ్ తో భారత్ ప్రపంచకప్ లో తన జర్నీ ప్రారంభిస్తుంది.

 

Exit mobile version