Asia Cup 2023: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ ) ఆగస్ట్ 30న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.
జట్టులోకి బుమ్రా..(Asia Cup 2023)
జస్ప్రీత్ బుమ్రా ఒక సంవత్సరం కంటే ఎక్కువ విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. చీలమండ నొప్పి కారణంగా కొంతకాలంగా జట్టులో లేని మహ్మద్ సిరాజ్ తిరిగి రావడంతో భారత పేస్ అటాక్ ఊపందుకుంది.ఆసియా కప్ 2023 కోసం టీమ్ ఇండియా ఎంపిక సమావేశానికి ముందు కేఎల్ రాహుల్ మరియు శ్రేయాస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్ ఒక పెద్ద ప్రశ్న. అయితే ప్రస్తుతం వీరిద్దరూ జట్టులోకి వచ్చారు.ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా భారత వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు.పాకిస్తాన్, భారతదేశం మరియు నేపాల్ గ్రూప్ Aలో ఉండగా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు శ్రీలంక గ్రూప్ Bలో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తుంది, పాకిస్తాన్ రెండు వేదికలలో నాలుగు మ్యాచ్‌లకు శ్రీలంక మిగిలిన గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఆసియా కప్ 2023 కోసం పూర్తి భారత జట్టు ఈ విధంగా ఉంది. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.