Site icon Prime9

Ashwin: ఆస్ట్రేలియా డూప్లికేట్ వ్యూహం.. అచ్చం అశ్విన్ లానే!

dup ashwin

dup ashwin

Ashwin: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ గా అవతరించేందుకు ఆసీసీ నానా తంటాలు పడుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన ఆ జట్టు.. ప్రతిష్టాత్మక టైటిల్ గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు.. భారత్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై ఈ సిరీస్ ఉండటంతో.. కంగారులు కొత్త ప్రయత్నానికి తెరతీశారు. ఎక్కువగా స్పిన్‌ బౌలర్లకు అనుకూలించే భారత పిచ్ లపై ఆట వారికి అంత సులభం కాదు.. దీనిని అధిగమించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు.

భారత్ పిచ్ లపై స్పిన్ ను ఎదుర్కోవడం అంతా ఈజీ కాదు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ వంటి స్పిన్నర్లను ఎదుర్కోవడం వారికి గగనమే. అందుకే అందుకే అచ్చం అశ్విన్ మాదిరిలానే బౌలింగ్ చేయగల.. గుజరాత్‌ బౌలర్లతో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రాక్టీసు చేస్తున్నారు.

ఎవరీ డూప్లికేట్ బౌలర్..

ఈ యువ క్రికెటర్ పేరు.. మహేశ్‌ పితియా. గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన యువ స్పిన్నర్.. దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

తాజా సీజన్‌తో రంజీల్లో ఎంట్రీ ఇచ్చిన అతడు ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.

దేశవాళీ క్రికెట్ లో మహేశ్‌ మొత్తంగా 8 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో 116 పరుగులు సాధించాడు. ఈ యువ స్పిన్నర్.. అశ్విన్‌లాగే సేమ్‌ హైట్‌లో బాల్‌ డెలివరీ చేయగల సత్తా ఉంది.

నిజానికి ఇలా బౌలింగ్ చేయడానికి అశ్విన్ రోల్ మోడల్ అని చెబుతాడు ఈ యువ ఆటగాడు.

2013 నుంచి అశ్విన్ బౌలింగ్ చూసినప్పటి నుంచి.. అతడికి అభిమాని అయినట్లు చెప్పాడు.

టీమిండియాతో సిరీస్‌తో నేపథ్యంలో మహేశ్‌ గురించి తెలుసుకున్న ఆసీస్.. అతడిని సంప్రదించింది.

ప్రస్తుతం.. ఆసీస్ ఆటగాళ్లు కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌లతో ఒకే బస్సులో ప్రయాణిస్తూ.. వారికి అందుబాటులో ఉంటున్నాడు.

దీంతో ఇతడి బౌలింగ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అచ్చం అశ్విన్ మాదిరిగానే.. బౌలింగ్ చేస్తున్నట్లు తెలిపారు.

2017లో ఆస్ట్రేలియా చివరిగా సారిగా భారత్‌లో టెస్టు సిరీస్‌ ఆడింది. అప్పుడు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈసారి అశూతో పాటు రవీంద్ర జడేజాకు.. వీరిద్దరికి తోడు అద్భుత ఫామ్‌లో ఉన్న అక్షర్‌ పటేల్‌ రూపంలో ఆసీస్‌ బ్యాటర్లకు ముప్పు ఎదురుకానుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version