Site icon Prime9

Apple CEO Tim Cook: ఢిల్లీ-కేకేఆర్ మ్యాచ్ లో యాపిల్ సీఈఓ సందడి

Apple CEO Tim Cook

Apple CEO Tim Cook

Apple CEO Tim Cook: ఐపీఎల్‌ 16 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ సీజన్ లో వరుసగా ఓటమిల తర్వాత ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో 128 పరుగుల లక్ష్యం చిన్నదే అయిన ఛేదించడానికి ఢిల్లీ కష్టపడింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలవడంతో ఆ జట్టుతో పాటు అభిమానులు కూడా ఖుషీ అయ్యారు. ఢిల్లీ కెఫ్టెన్ డేవిడ్ వార్నర్ 57 పరుగులతో రాణించాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 127 పరుగులకూ ఆలౌట్ అయింది. జాసన్ రాయ్(43), రస్సెల్ (38) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఇషాంత్ శర్మ తన నాలుగు ఓవర్ల కోటా లో 19 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.

 

స్పెషల్ గెస్ట్ గా స్టేడియానికి(Apple CEO Tim Cook)

అయితే ఈ మ్యాచ్ లో మరో విశేషం ఉంది. యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్పెషల్ గెస్ట్ గా స్టేడియానికి వచ్చి మ్యాచ్ ను వీక్షించారు. భారత్ లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్స్ ప్రారంభించేందుకు ఆయన భారత్ పర్యటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిమ్ కుక్ పలు ప్రాంతాలను సందర్శించారు. భారత బ్యాడ్మింటన్ స్లార్స్ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ను కలిశారు. తర్వాత ఆయన ఢిల్లీ కోల్ కతా మ్యాచ్ ను చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి విచ్చేశారు.

 

 

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో కలిసి ఆయన మ్యాచ్ ను చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎప్పుడూ బిజీగా గడిపే యాపిల్‌ సీఈవో.. ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు రావడంపై నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తే పలు కామెంట్లను సోషల్ మీడియా లో పంచుకున్నారు.

Exit mobile version