Site icon Prime9

Anand Mahindra: రింకు శక్తినంతా సీసాలో నింపి.. రక్తంలోకి ఎక్కించాలని కోరుకుంటున్నా..!

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: ఆదివారం గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసినవాళ్లకి ‘రింకు సింగ్’పేరు ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. ప్రజెంట్ క్రికెట్ ప్రపంచంతో పాటు సోషల్ మీడియాలో రింకు సింగ్ పేరే ట్రెండింగ్. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఆఖరి ఓవర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో రింకు సింగ్ పై అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రెటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్‌ మహీంద్రా సైతం రింగూ ఆటపై స్పందించారు. రింకు సింగ్‌ ఆట తీరును ప్రస్తావించకుండా మండే మోటివేషన్‌ గురించి ఎలా మాట్లాడగలమంటూ ప్రశంసలు కురిపించారు. రింకు శక్తిని అంతా ఒక సీసాలో నింపి, మన రక్తంలోకి ఎక్కించాలని కోరుకుంటూ.. ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంత బలం ఎలా వచ్చింది?(Anand Mahindra)

ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే..‘రింకు సింగ్‌ అద్భుతమైన ఆటతీరుతో చివరి ఓవర్‌ లో మ్యాచ్‌ను గెలిపించిన తీరు గురించి ప్రస్తావించకుండా మండే మోటివేషన్‌ గురించి ఎలా మాట్లాడగలం? ‘డూ ఆర్ డై’ అనే పరిస్థితిలో అతని మనసులో ఏం అనుకున్నాడో తెలుసుకోవాలనుంది. ఆ విధంగా బంతిని బాదగల మానసిక బలం అతనికి ఎలా వచ్చింది? ఆ శక్తినంతా ఒక సీసాలో నింపి, మన రక్తంలోకి ఎక్కించాలని కోరుకుంటున్నా..!’ అంటూ మహీంద్రా ట్వీట్‌ చేశారు. అవును నిజం చెప్పారంటూ.. నెటిజన్లు సైతం ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

 

ఎంతో ఒత్తిడిలో కూడా రింకు సింగ్‌ బ్యాటింగ్‌ అద్భుతమంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేయగా.. అతని శక్తిసామర్థ్యాల వెనుక ఎంతో కఠోర శ్రమ దాగుందని ఇంకొకరు అన్నారు. రింకు సింగ్‌కు ఓ థార్‌ వాహనాన్ని బహుమతిగా ఇవ్వాలంటూ పలువురు కామెంట్లలో ఆనంద్ మహీంద్రా విజ్ఞప్తి చేశారు.

 

Exit mobile version