Site icon Prime9

ENGLAND: వైరల్ వీడియో.. క్రికెట్‌ చరిత్రలో అద్భుతమైన క్యాచ్‌

england

england

ENGLAND: క్రికెట్ లో ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పలేం. మైదానంలో క్రికెటర్లు బంతిని ఆపడానికి.. లేదా క్యాచ్ లు పట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో కొందరు సఫలం అవ్వగా.. కొందరు విఫలం అవుతారు. కొందరు కళ్లు చెదిరే రీతిలో బంతుల్ని ఆపాతారు. మరికొందరు.. ఆశ్చర్యపోయోలా క్యాచ్ లు అందుకుంటారు. ఇలాంటి ఘటనే ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ తో అందిరి దృష్టిని ఆకర్షించాడు.

అద్భుత క్యాచ్.. వైరల్ అవుతున్న వీడియో (ENGLAND)

ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌ తో ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. న్యూజిలాండ్ మెుదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్‌ ఆటగాడు ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. అద్భుతమైన డైవింగ్‌ చేస్తూ.. కివీస్ బ్యాటర్‌ నికోల్స్‌ను పెవిలియన్‌ పంపాడు. జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో రివర్స్ స్వీడ్ ఆడేందుకు ప్రయత్నించి.. ఔటయ్యాడు. ఫ్రంట్ ఫుట్ లో ఫీల్డింగ్ చేస్తున్న పోప్‌ ఒంటి చేత్తో ఈ క్యాచ్ ను అందుకున్నాడు. 30 పరుగులు చేసిన నికోల్స్‌ నిరాశతో వెనుదిరిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజికి మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తమ మెుదటి ఇన్నింగ్స్ లో 435 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లెర్డ్ చేసింది.

హ్యారీ బ్రూక్ వరల్డ్ రికార్డ్

న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు.. హ్యారీ బ్రూక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కొద్ది రోజుల క్రితమే.. ఇంగ్లాండ్ జట్టులోకి అడుగుపెట్టిన ఈ ఆటగాడు దూసుకెళ్తున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో రికార్డు నెలకొల్పాడు. తక్కువ ఇన్నింగ్స్ లలో అత్యధిక పరుగులు సాధించి.. రికార్డులకెక్కాడు. కేవలం ఇప్పటివరకు.. ఆరు టెస్టు మ్యాచులాడాడు. ఇందులో 9 ఇన్నింగ్స్ లలో 807 పరుగులు చేశాడు. టెస్టు చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి రికార్డును ఎవ్వరు సాధించలేదు. ఇప్పటి వరకు ఈ ఘనత భారత ఆటగాడు వినోద్ కాంబ్లీ పేరిట ఉంది. వినోద్ కాంబ్లీ తన తొలి 9 ఇన్నింగ్స్‌ లలో 798 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డను బ్రూక్ తిరగరాశాడు. టెస్టుల్లో ప్రస్తుతం బ్రూక్ సగటు.. 100.8. ఈ సగటు చూస్తేనే అతడు ఎలాంటి విధ్వంసం సృష్టించగలదో అర్ధం అవుతుంది. 9 ఇన్నింగ్స్ లలో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇతని ఆటతీరుని గమనించి.. సన్‌రైజర్స్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది.

 

Exit mobile version