Site icon Prime9

Telangana Congress: టీ కాంగ్రెస్ కొత్త వ్యూహం.. ఆపరేషన్ 100 డేస్

t-congress

t-congress

Prime9Special: కొద్ది రోజులుగా అంతర్గత కలహాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు సైలెంట్మ అయిపోయారు. ఇప్పటికే మునుగోడు విషయంలో టీఆరెస్, బీజేపీలు విజయమే లక్ష్యంగా దూకుడుగా వెళ్తుంటే కాంగ్రెస్ మాత్రమే అభ్యర్థి ఎంపిక పై సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో ఒక మౌనం కనిపిస్తుంది. అది వ్యూహాత్మక మౌనమేనని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. తాత్కాలిక ఉపశమనం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనం పొందేలా సరికొత్త ఎత్తుగడ వేస్తున్నామంటున్నాయి. 2023 అధికారమే లక్ష్యంగా సెప్టెంబర్ మొదటి వారం నుండి ఆపరేషన్ 100 డేస్ కార్యాచరణను ప్రారభించబోతోంది. ఈ 100 రోజుల ప్రణాళిక లో మునుగోడు లో సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లడానికి స్కెచ్ గీస్తున్నారు. అక్కడ నేతలు చేజారినా క్యాడర్ బలంగా ఉండడంతో ముఖ్య నేతలు అక్కడే ఉండి పర్యవేక్షించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

ఇప్పుడున్న అంచనాల ప్రకారం అక్టోబర్ మూడవ వారంలో మునుగోడు ఉప ఎన్నిక కు నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ రెండవ వారం లో ఎన్నిక జరిగే అవకాశం ఉందని టీకాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర అక్టోబర్ చివరి వారంలో తెలంగాణ కి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ యాత్ర ను విజయవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే రాహుల్ జోడోయాత్ర మునుగోడుకి ఎంతోగానో ఉపయోగపడుతుందని నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ, టీఆరెస్ లను ఇరుకున పెట్టేలా ప్రత్యేక విభాగం పని చేస్తోంది. ధరల పెరుగుదల కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఎంత వరకు ఉద్యమ ఆకాంక్ష లు నెరవేరాయని ఇటు టీఆరెస్ ని సైతం ఇరుకున పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే రాహుల్ పర్యటన కేవలం మునుగోడు అంశానికె పరిమితం చేయకుండా 2023 ఎన్నికలే లక్ష్యంగా యాత్ర సాగనుంది. రాహుల్ గాంధీ వరంగల్ సభ తరువాత వచ్చిన జోష్ కొనసాగించలేకపోవడం వల్ల ఈ సారి గతంలో జరిగిన తప్పిదాన్ని పునరావృతం కాకుండా ఎప్పటికి ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

రాహుల్ గాంధీ 15 రోజుల భారత్ జోడోయాత్ర , మునుగోడు ఉప ఎన్నిక ముగింపు తరువాత 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారట. అది ఎన్నికల వరకు ఉండేలా అన్ని జిల్లాలను కవర్ చేస్తూ రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నారట. ప్రస్తుత సంక్షోభం నుండి పార్టీ బయటపడాలంటే ఇది ఒక్కటే మార్గమని అదిష్టానం సైతం భావిస్తుందట. అయితే పీసీసీ పాదయాత్రకి పార్టీలోని నేతలే వ్యతిరేకించకుండా ఉండడానికి అందరిని కలుపుకొని వెళ్తూ ఈ యాత్ర సాగించాలని పార్టీలోని కొంతమంది పీసీసీ కి తేల్చి చెవుతున్నారట. అందరూ కలిసి ప్రజల్లో వెళ్లి తాము కలిసి ఉన్నామని మీ కోసం పోరాడతామని చెప్పడమే పెద్ద టాస్క్ అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. పీసిసి అధ్యక్షుడిగా రేవంత్ వచ్చిన కొత్తలోనే పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ పార్టీలోని కొంతమంది నేతలే అడ్దుకున్న పరిస్థితి. తాజాగా ఆపరేషన్ 100 డేస్ వ్యూహం ఎంతవరకు పని చేస్తుందో చూడాలి మరి.

Exit mobile version