Ablu Rajesh: స్ప్రింగ్ కాళ్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న అబ్లు రాజేష్

కృషి ఉంటే మనుషులు రుషులవుతారని, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం కూడా ఆయుధంగా మారుతుందని, అమృత్ సర్‌కు చెందిన అబ్లు రాజేష్ అనే యువకుడు నిరూపించారు. తన రెండు కాళ్లూ లేకపోయినా, స్ర్పింగ్ కాళ్లతో డ్యా్న్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 21, 2023 / 06:57 PM IST

Amritsar: కృషి ఉంటే మనుషులు రుషులవుతారని, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం కూడా ఆయుధంగా మారుతుందని, అమృత్ సర్‌కు చెందిన అబ్లు రాజేష్ అనే యువకుడు నిరూపించారు. తన రెండు కాళ్లూ లేకపోయినా, స్ప్రింగ్ కాళ్లతో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 2009 లో ప్రమాదవ శాత్తు రెండు కాళ్లను పోగొట్టుకున్న రాజేష్, స్ప్రింగ్ కాళ్లతో నడక ప్రారంభించారు. అయితే, తాను డ్యాన్స్ చేయాలనే పట్టుదలను మాత్రం పోగొట్టుకోలేదు. దాంతో, ఇన్ స్టాగ్రామ్, మోజ్, జోష్ యాప్‌లలో డ్యాన్స్ వీడియోలు పెడుతూ నెటిజన్ల మన్ననలు అందుకున్నారు. కేవలం 6 నెలల్లోనే, సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు.

ఒక్క జోష్ యాప్ లోనే 29 మిలియన్స్ ఫాలోవర్లను సంపాదించుకున్న రాజేష్, మోజ్‌లో1.5 మిలియన్ ఫాలోవర్లతో పాటు, ఇన్ స్టాగ్రామ్‌లో 145కే ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇక అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా తన పేరుతో ఏదైనా రికార్డు నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా, తన నిర్ణయాన్ని మోజ్ యాజమాన్యానికి తెలియాజేశారు. ఆయన విజ్నప్తికి స్పందించిన, మోజో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డును ఆశ్రయించింది. దాంతో, ఒక్క చేత్తో జాతీయ జెండాను పట్టుకుని కిలోమీటర్ సైకిల్ తొక్కి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. రాజేష్ సైక్లింగ్ లైవ్‌ను మోజో తన యాప్‌లో లైవ్ పెట్టి ప్రేక్షకులకు రాజేష్ పట్టుదలను ప్రచారం చేసింది.

రాజేష్ రికార్డు సాధించిన విషయాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రకటించింది. భారత్ తరఫున రికార్డు నమోదు చేసిన వ్యక్తిగా, రాజేష్ ను గుర్తించినట్టు,  ప్రశంసా పత్రాన్ని అందజేసింది.