Site icon Prime9

YSRCP MLA : ఓట్ల కోసం మరి ఇంతకు దిగజారతారా ?

MLA prime9news

MLA prime9news

YSRCP :  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొత్త వివాదంలో చిక్కుకున్నారు.వైఎస్సార్‌సీపీకి ఓటు వేయకపోతే పింఛన్ ఆగిపోతుందంటూ ఒక మహిళతో అన్న మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ శంఖవరం మండలం అన్నవరం వెల్లంపేటలో గడప గడపకు కార్యక్రమంలో మన ప్రభుత్వం పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.గడప గడపకు వెళ్తూ ప్రభుత్వం అందించిన పథకాలు..కుటుంబాలకు చేరిన లబ్ధి గురించి ప్రజలకు పూర్తిగా వివరించారు.

ఈ క్రమంలోనే పలువురి ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వం అందించిన లబ్ధి గురించి వివరించారు.ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు.ఈ సారి జరగబోయే ‘ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు మీ ఓటెయ్యాలి.. వెయ్యకపోతే మీ పింఛన్లు ఆగిపోతాయ’ని వాళ్ళ మొహం మీదే చెప్పారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ వీడియోలో తెగ వైరల్ అవుతున్నాయి.‘మీకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు వంటివన్నీ జగన్‌ ప్రభుత్వమే ఇచ్చిందని ఆయన అన్నారు.వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేయకపోతే ఇప్పుడు వచ్చే పథకాలు ఏవి కూడా రావంటూ ప్రజల్ని బెదిరిస్తున్నారని టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆయన మాట్లాడినా వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.

Exit mobile version