Site icon Prime9

MLA Jaggareddy: నోటు ఎవరిచ్చినా.. మీదే తీసుకోండి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Whoever gave the note...it is yours...Congress MLA

Whoever gave the note...it is yours...Congress MLA

Munugode: అతను ఏం మాట్లాడిన సంచలనమే. అడపా, దడపా వస్తుంటారు. మాట్లాడిన రెండు మాటలు సంచలనంగా నిలుస్తుంటాయి. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. డబ్బులు ఎవరిచ్చినా, అది మీ డబ్బే, కాబట్టి తీసుకోండి అంటూ మునుగోడు ఓటర్ల నుద్దేశించి పేర్కొన్నారు.

మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో భాజపా, తెరాసలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలవకుండా రాజకీయ కుట్ర సాగుతుందోని జగ్గారెడ్డి ఆరోపించారు. మునుగోడు ఓటర్లు ఇది గమనించాలని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసేందుకు భాజపా, తెరాస నేతలు నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. మతం ముసుగులో భాజపా రెచ్చగొడుతుందన్నారు. డబ్బులు ఆశ చూపి అధికార పార్టీ తెరాస గెలిచే ప్రయత్నాలు చేస్తుందన్నారు.

ఇది కూడా చదవండి:  ఉప ఎన్నికలో ట్విస్ట్.. గ్లాసులో మద్యం పోస్తూ బుక్కయిన మంత్రి మల్లా రెడ్డి

Exit mobile version