Munugode: మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, వి హెచ్ హనుమంతరావు గట్టుప్పలో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు ఓటెయ్యాలంటూ అభ్యర్ధించారు.
ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధిగా చెప్పుకొచ్చారు. భాజాపా ప్రభుత్వంలో అదాని, అంబానీలదే రాజ్యమంటూ విమర్శించారు. పేద, మద్యతరగతి ప్రజల నడ్డివిరిచేలా జీఎస్టీని వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ తోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడలేదని, సోనియాగాంధి ఇస్తేనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నిక సమయంలో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని తనదైన శైలిలో వారిని కోరారు.
ఓటర్లను కలుసుకొంటూ నీ కాళ్లు మొక్కుతా కాంగ్రెస్ ను గెలిపించండి, అభివృద్ధికి సహకరించండి అంటూ భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొన్నారు. గుర్తు పట్టని వారికి తాను ఓడిపోయిన వ్యక్తిగా పరిచయం చేసుకొన్నారు. మీ వీహెచ్ అంటూ సరదగా వారితో ముచ్చట్లాడారు. నేలపై కూర్చొన్నారు. రోడ్డు మద్యలోనే వారితో మాట్లాడుతూ ఓటర్లను ఆకర్షించారు.
ఇది కూడా చదవండి: Army helicopter crash: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. 6గురు మృతి