Site icon Prime9

Karnataka New CM: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య.. ఎల్లుండి ప్రమాణస్వీకారం

siddaramaih

siddaramaih

Karnataka New CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య సీనియారిటీ, క్లీన్ ఇమేజ్, ఓబిసి నేత, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బుజ్జగింపులు.. (Karnataka New CM)

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య సీనియారిటీ, క్లీన్ ఇమేజ్, ఓబిసి నేత, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీనియార్టీ, క్లీన్ ఇమేజ్ దృష్ట్యా సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వార్తా సంస్థ ANI ప్రకారం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘ చర్చల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకాభిప్రాయానికి వచ్చారు.

శనివారం కంఠిరవ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఇక సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు సిద్దరామయ్య ఇంటి వద్ద ముఖ్యమంత్రి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.

చర్చల్లో సిద్దు విజయం

సీఎం పదవి కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటి నెలకొంది. ఈ పోరులో సిద్దరామయ్య విజయం సాధించినట్లు తెలుస్తోంది.

వీరిద్దరి మధ్య సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్‌లో గందరగోళం ఎలా ఏర్పడిందో.. కాంగ్రెస్ పేరు ఖరారు చేయడానికి నాలుగు రోజులు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు.

దీంతో అధిష్టానం ప్రతిపాదనకు డీకే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంతో పాటు.. 2+3 ఫార్ములాకు ఓకే చెప్పినట్లుగా సమాచారం.

మొదటి రెండేళ్లు సీఎంగా సిద్దు, ఆ తర్వాత మూడేళ్లు ముఖ్యమంత్రిగా డీకే ఉండేలా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

 

Exit mobile version