Site icon Prime9

Nedurumalli Ram Kumar Reddy: వెంకటగిరిలో ప్రోటోకాల్ వివాదం.. ఆగ్రహం వ్యక్తం చేసిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి

Protocol controversy in Venkatagiri

Protocol controversy in Venkatagiri

Venkatagiri: అసెంబ్లీ ఎన్నికలు జరిగి 3 సంవత్సరాలు దాటిన క్రమంలో అధికార వైకాపాలో ముసలం ప్రారంభమైంది. గతంలో కిమ్మనకుండా ఉన్న నేతలు సైతం ఇప్పుడు బహిరంగంగానే విమర్శలు చేస్తూ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రోటోకాల్ విషయంలో తప్పు జరుగుతుందంటూ అధికారులకు వైకాపా నేత వార్నింగ్ ఇవ్వడం పెద్ద దుమారమే లేపుతుంది.

వివరాల్లోకి వెళ్లితే, వెంకటగిరి వైకాపా నేత నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి స్టేట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ గా ఉన్నారు. క్యాబినెట్ ర్యాంకు ఉన్న తనను అధికారులు అవమానిస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అసలు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. ఇక ఊరుకొనేది లేదని స్పష్టం చేశారు. మంత్రి రోజాకు సైతం ప్రోటోకాల్ ఇవ్వడం లేదని రాం కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఇదంతా స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి తెలియక పోవచ్చని సందేహాన్ని కూడా వ్యక్త పరిచారు. ప్రోటోకాల్ విషయం పై జిల్లా కలెక్టర్, ప్రివిలైజ్ కమిటీ, జీఏడీకి ఫిర్యాదు చేస్తానని అధికారులను హెచ్చరించారు. నేను మాట్లాడిన మాటలను వార్నింగ్ అనుకొంటారో, ఇంకేమైనా అనుకొంటారో మీ ఇష్టమంటూ పేర్కొన్నారు. మరోసారి ప్రోటోకాల్ విషయంలో తప్పు జరిగితే సహించేది లేదంటూ రాంకుమార్ రెడ్డి అధికారులను హెచ్చరించారు.

గత కొంతకాలంగా స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి వైకాపాలో ఉన్నారని పేరేగాని పెద్దగా ఆయనకు ప్రచారం ఉండడం లేదు. ప్రజా సమస్యలు సైతం సరిగా పరిష్కారం కావడం లేదని అడప దడప బహిరంగానే పేర్కొంటున్నారు. దీంతో ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత చోటుచేసుకొని వుంది.

తాజాగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ప్రోటోకాల్ విషయంలో మంత్రి రోజా, తనకు అవమానం జరుగుతోందంటూ అధికారులను దయ్యబట్టారు. ఒక దశలో ఇందులో స్థానిక శాసనసభ్యులు ప్రమేయం ఉండకపోవచ్చని చెప్పడం గమనార్హం. గత కొంత కాలంగా నేదురుమల్లి, ఆనం వర్గాల మద్య బేదాభిప్రాయాలు చోటు చేసుకొని వున్నాయి. ఈ నేపధ్యంలో రాంకుమార్ రెడ్డి వ్యాఖ్యలతో వాటికి బలం చేకూరుతుంది. ఈ మద్య జరిగిన వెంకటగిరి జాతర సమయంలో స్థానిక ముఖ్య నేతలకు కొంతమందికి సరైన మర్యాదలు జరగక పోవడంతో ఓ వర్గం వారు రగిలి పోతున్నారు. వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రి రోజాకు కూడా ప్రోటోకాల్ ఇవ్వలేదంటూ వ్యాఖ్యానిస్తూ సొంత పార్టీ వారే రోడ్డెక్కుతున్నారు.

ఇది కూడా చదవండి: ఓట్ల కోసం మరి ఇంతకు దిగజారతారా ?

Exit mobile version