Ponguleti – Jupalli: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో జులై మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వీరిరువు కలిశారు. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రావాలని రాహుల్ గాంధీని టీపీసీసీ నేతలు ఆహ్వానించారు. ఆ సభలోనే తెలంగాణలోని పలు పార్టీల నుంచి మరింత మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అంతా మరల సొంత పార్టీలోకి రావడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఘర్ వాపసీ జరుగుతుందని ఆయన చెప్పారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏఐసీసీ కార్యాలయం వద్దే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, చిన్నా రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, దామోదర్ రాజనర్సింహ, మధుయాష్కీ, మల్లు రవి, సంపత్, వంశీ చంద్ రెడ్డి, బలరాం నాయక్, రేణుకా చౌదరి ఉన్నారు. కాగా మొదటిగా ఖమ్మం సభలో కాంగ్రెస్‌లో చేరనున్న 35 మంది నేతల పేర్లను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
35 మంది నేతల పేర్లు(Ponguleti – Jupalli)
జూపల్లి కృష్ణారావు
గుర్నాథ్ రెడ్డి
కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
తాడిపర్తి సాయి చరణ్ రెడ్డి
మేఘారెడ్డి తుడి
కూర అన్న కిష్టప్ప
ముద్దప్పా దేశ్ ముఖ్
జూపల్లి అరుణ్
సూర్య ప్రతాప్ గౌడ్
కల్యాణ్ కుమార్ కొత్త
దండు నర్సింహ
సానే కిచ్చా రెడ్డి
గోపిశెట్టి శ్రీధర్
సూర్య
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కోరం కారకయ్య
పాయం వెంకటేశ్వర్లు
మువ్వా విజయ బేబీ
తెల్లం వెంకటరావు
పిడమర్తి రవి
జారే ఆది నారాయణ
బానోత్ విజయ.
తెల్లూరి బ్రహ్మయ్య
మద్దినేరి స్వర్ణ కుమారి
బొర్రా రాజశేఖర్
కోట రాంబాబు
ఊకంటి గోపాల్ రావు
డా.రాజా రమేశ్
జూపల్లి రమేశ్
అయిలూరి వెంకటేశ్వర రెడ్డి
హనుమాండ్ల జాస్ని రెడ్డి
రఘునాథ్ యాదవ్
రాఘవేంద్ర రెడ్డి
కేతా మనోహర్ రెడ్డి
సుతగాని జైపాల్