Site icon Prime9

Chandrababu Padayatra: చంద్రబాబు డైరెక్షన్ లో పాదయాత్ర

Padayatra movement under direction of babu

Padayatra movement under direction of babu

Vidala Rajani:  పాదయాత్ర ఆధ్యంతం మాజీ సీఎం చంద్రబాబు నేపధ్యంలోనే సాగుతుందని పదే పదే చెబుతున్నారు. తాజాగా మంత్రి విడదల రజిని చంద్రబాబుపై మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయవ్యవస్ధలపై నమ్మకముందన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడివుందని ఆమె స్పష్టం చేశారు. పాదయాత్రతో శాంతి భధ్రతల సమస్య వస్తే అందుకు బాధ్యత తెలుగుదేశం అధినేత చంద్రబాబుదేనంటూ మంత్రి పేర్కొన్నారు.

2024 విద్యా సంవత్సరం నుండి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమౌతాయని మంత్రి తెలిపారు. చంద్రబాబు హయాంలో మెడికల్ కాలేజీ తీసుకురాలేదని మంత్రి ఎద్దేవా చేశారు. మరో అడుగు ముందుకేసిన మంత్రి విడదల రజనీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైకాపా పాత్రపై పలు ఆరోపణలు గుప్పిస్తుండడంతో తల్లి లాంటి భారతీపై ఆరోపణలు చేస్తే ఊరుకొనేది లేదని ఆమె ఘాటుగా హెచ్చరించారు.

వైకాపా నేతలు పాదయాత్రను అడ్డుకొంటామని పేర్కొంటున్న సమయంలో మంత్రి రజని మాటలు ఆ పార్టీ శ్రేణులను మరింతగా రెచ్చగొడుతున్నాయి. పోలీసుల మాత్రం ఎక్కడా వ్యతిరేక ఆరోపణలు గుప్పించవద్దంటూ చెప్పకపోవడం బట్టి, పాదయాత్రలో విధ్వంసం సృష్టించేందుకు అధికార పార్టీ రెడీ అవుతుందని మంత్రి రజని మాటలతో తేటతెల్లమవుతుంది.

Exit mobile version