Site icon Prime9

Nadendla Manohar: మంత్రి అప్పలరాజుకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓపెన్ ఛాలెంజ్.. ఏంటంటే..?

nadendla manohar

nadendla manohar

Nadendla Manohar: నాదెండ్ల మనోహర్ ఎంపీ సిదిరి అప్పలరాజుకు సవాల్ విసిరారు. ఎంతమందికి మత్శ్యకార భరోసా ఇచ్చారో చెప్పాలని.. ఎంత మంది లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం చేయూతనిచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపూ పాలనను ఎండగట్టేలా యువత అంతా గళం విప్పాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీనికి తగ్గట్టుగానే వరుస కార్యక్రమాలతో జన సైనికుల్లో జోష్‌ నింపుతూ యువతను మేల్కొలిపేలా ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో “యువశక్తి ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.

రణస్థలంలో ఏర్పాట్లు పూర్తి..

ఈ మేరకు రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం అంటూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఉత్తరాంధ్ర యువతను ఒకేచోటకు తీసుకొచ్చేలా, ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నేతలు చెబుతున్నారు. కాగా, దీనికి సంబంధించిన ఏర్పాట్లను జనసేన నేత నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందని 30 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పిలుపునిచ్చారు.

34 నియోజకవర్గాల్లోనూ న్యాయవాదులు..

ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర అని అలాంటి ఈ ప్రాంతం ఫౌండేషన్ స్టోన్‌లకే పరిమితం అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో మైనింగ్ మాఫియా పెరిగిపోయిందని దీనిపై యువత గళంవిప్పాలని మీ వెనుక జనసేనాని పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాలకు న్యాయవాదులను నియమిస్తున్నామని.. ఉత్తరాంధ్ర సమస్యలనకు సంబంధించిన ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా న్యాయవాదులు, జనసేన నేతలు మరియు మీకు అండగా ఉంటారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి…

Janasena Party : వైసీపీ ముగ్గుల పోటీల్లో జై జనసేన అన్న యువతి.. అంబటి రాంబాబుకి షాక్

Mekapati Chandrashekar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి భార్య కొడుకుని అంటూ.. బహిరంగ లేఖ.

Kuppa Thotti Roja : మంత్రి రోజాకి గట్టిగా ఇచ్చిన నాగబాబు… నీది నోరు కాదు చెత్తకుప్ప తొట్టి అంటూ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

 

Exit mobile version