Site icon Prime9

Vasantha KrishnaPrasad : మా నాన్న నోరు మంచిదికాదు.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

YCP MLA

YCP MLA

Vasantha KrishnaPrasad: తన తండ్రి వసంత నాగేశ్వరరావు నోరు చాలా ప్రమాదకరమని, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజం అని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి మద్దతుగా తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని వాటిని ఖండిస్తున్నట్లు మైలవరం తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును తన తండ్రి తప్పుపట్టడం తను సమర్థించనని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్ తోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీలో గందరగోళ వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పోటీ చేయమంటే చేస్తా, లేకుంటే పార్టీ కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. తాను అవకాశం ఇప్పించిన వారు కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. జోగి రమేష్ తో తనకు ఉన్న విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడతానని అన్నారు.

మరోవైపు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి తప్పుబట్టారు. గత టీడీపీ హయాంలో మైనార్టీ, ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని.. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని కొడాలి నాని పేర్కొన్నారు. ఒక్క కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వడం లేదని అనడం సరి కాదని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే పదవులు కేటాయించారని ఆయన అన్నారు.

Exit mobile version