Site icon Prime9

MP Dharmapuri Arvind: కేటీఆర్ పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

MP Arvind who made sensational comments on KTR

MP Arvind who made sensational comments on KTR

Hyderabad: తెలంగాణ మంత్రి కేటీఆర్ జోకర్ ట్వీట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారని, ఆ మాటలు పట్టించుకోమన్నారు. జోకర్లు అనే మాట అనే ముందు మీ తండ్రి కేసీఆర్ ధర్డ్ క్లాస్ బ్రోకర్ అని గుర్తుంచుకోవాలన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను చంపడానికి తర్ఫీదు ఇస్తున్న పిఎఫ్ఐ సంస్ధను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆయన మాట్లాడారు.

లిక్కర్ కుంభకోణంలో కవిత జైలు కెళ్లడం ఖాయమన్నారు. ఢిల్లీకి విచారణ నేపధ్యంలో కవిత రావడం నాలుగు రోజుల్లో జరుగుతుందన్న అరవింద్, అదే రోజు కవితను అరెస్ట్ చేస్తారని హేళన చేశారు. బిల్డర్ స్కాంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్నారు. ఇందుకు జైళ్ల శాఖామంత్రి వారివురి కోసం జైళ్లను సిద్దం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అవినీతి కేసుల్లో తండ్రీ కొడుకులు అరెస్ట్ అవడం తధ్యమన్నారు. బీజేపి దర్యాప్తు సంస్ధలను ప్రభావితం చేస్తుందన్న మాటలను ఆయన కొట్టిపడేసారు. పారదర్శకంగా వ్యవస్ధలు పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Exit mobile version