Site icon Prime9

YS Sharmila: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి.. సీబీఐకు వైఎస్ షర్మిల ఫిర్యాదు

YS Sharmila

YS Sharmila

Delhi: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకు ఫిర్యాదు చేసారు. దీనిపై త్వరగా విచారణ జరపాలంటూ నేడు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఓ కాంట్రాక్ట్‌ సంస్థతో కలిసి కాళేశ్వరంతో పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మెగా కంపెనీతో కలిసి ఈ అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

ఇదే విషయమై షర్మిల గవర్నర్ తమిళిసైకి కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని సమస్యల గురించి ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని తెలిపారు. అలాగే కాళేశ్వరం ముంపు, వర్షాల వల్ల కల్గిన నష్టం గురించి కూడా గవర్నర్ కు వివరించారు. తాజాగా షర్మిల ఢిల్లీ వెళ్లడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రమే చర్చిస్తారా లేక ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

షర్మిల ఈనెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లారు. మొదటన తన వద్ద ఉన్న సాక్ష్యాలతో సీబీఐకి ఫిర్యాదు చేశారు. మరికొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా సమావేశం అవుతారు. అయితే ఢిల్లీలో బీజేపీ నేతలు ఎవరితో సమావేశం అవుతారన్నదాని పై స్పష్టత లేదు.

Exit mobile version
Skip to toolbar