Site icon Prime9

BRS Meeting In Khammam: మెక్ డొనాల్డ్స్ పిజ్జాలు, బర్గర్లు తినడం సిగ్గుచేటు.. కేసీఆర్ మనసుని కలిచివేస్తోన్న అంశం ఇదేనా..?

kcr speech about McDonalds At BRS meeting in khammam

kcr speech about McDonalds At BRS meeting in khammam

BRS Meeting In Khammam: ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభ(BRS Meeting In Khammam)లో కేసీఆర్ తన మనసుని ఎంతో కాలంగా ఓ అంశం కలిచివేస్తోందని చెప్పారు.

ఆ అంశం ఏంటంటే.. రాజకీయాలు జరుగుతుంటయి ఎందరో గెలుస్తరు ఎందరో ఓడతారు.. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దేశం బిత్తరపోయి గత్తర తప్పిందా.. మన దేశానికి లక్ష్యం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు.

దేశంలో లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. దేశంలోని సహజ సపంద ఈ దేశ ప్రజల సొత్తని.. ఇదంతా ఏమైపోతుందని ఆయన అన్నారు.

మనం అన్ని వనరులు ఉండి కూడా ఎందుకు ఇతర దేశాలను అడుక్కోవాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు.

అన్ని సహజ వనరులుండి కూడా మనం ఎందుకు ప్రపంచ బ్యాంకును అడుక్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు.

ఈ అంశం తనను ఎంతో కాలంగా బాధిస్తోందని.. మనకు అన్నీ ఉండి కూడా ఇతర దేశాల వైపు ఎందుకు చూడాల్సి వస్తోందని అన్నారు.

ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టిన భారత దేశం.. మెక్ డొనాల్డ్స్ పిజ్జాలు బర్గర్లు తినడం సిగ్గుచేటు అంటూ ఆయన అన్నారు.

యావత్ ప్రపంచానికి వ్యవసాయాన్ని నేర్పిన భారతదేశం ఇప్పుడు పప్పు నూనెలను దిగుమతి చేసుకోవడం ఏంటి అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.

మంచినీళ్లియ్య చాతకాని కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతుందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్ గట్టి సందేశం..

ఖమ్మం వేదికగా అటు జాతీయ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి బలోపేతం అవ్వాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తోన్నారు.

కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా మారాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కూడా ఇదే కావడం విశేషం.

ఇక ఈ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరు అవుతుండటం రాజకీయ వర్గాల్లో ఈ సభ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈసభలో పాల్గొనడానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పినరయి విజయన్, అఖిలేష్, పంజాబ్ సీఎం, డి రాజా తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు.

జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యామ్నాయంగా మారుతుందని మొదటి నుంచి కేసీఆర్‌ చేప్తూనే వచ్చారు.

కాగా ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా ఖమ్మం వేదికగా కేసీఆర్ గట్టి సందేశాన్ని ఇవ్వనున్నారు.

ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు,  దానిని నడిపే శక్తి బీఆర్‌ఎస్‌కు ఉందనే సంకేతాలను ఈ సభ ద్వారా కేసీఆర్‌ ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar