Site icon Prime9

Bandi Sanjay: కేసిఆర్.. దమ్ముంటే పార్టీలో చేర్చుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు..

KCR... Get the Congress MLAs who joined the party to resign

KCR... Get the Congress MLAs who joined the party to resign

Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికలు అధికార పార్టీ తెరాసకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. ఓవైపు పార్టీ యంత్రాంగం మొత్తం మునుగోడులో ప్రచారం చేస్తుంటే, మరో వైపు ప్రతిపక్షాలు పదునైన అస్త్రాలను వదులుతూ తెరాస నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.

తాజాగా బండి సంజయ్ సీఎం కేసిఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని బండి డిమాండ్ చేశారు. ఎన్నికలకు మేం సిద్ధం, మీరు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. నియోజక వర్గ సమస్యల పై చర్చించేందుకు నాటి ఎమ్మెల్యే రాజగోపాల్ కు కేసిఆర్ టీం సరైన సమయం ఇవ్వలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా కమ్యూనిస్ట్ పార్టీ నేతలకు ఓ హితవు చెప్పారు. కేసిఆర్ చేస్తున్న మోసాలకు సపోర్ట్ చేస్తే అన్యాయాలకు మద్ధతు పలికిన్నట్లేనని ఆయన అన్నారు. తెలంగాణాలో రామరాజ్యం తెస్తామని బండి ఆత్మ విశ్వాసంతో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Munugode by poll: తెరాసకు జలక్ ఇస్తున్న కుల సంఘాలు

Exit mobile version