Site icon Prime9

Karnataka Congress: 34 మందితో కొలువుదీరిన సిద్ధరామయ్య క్యాబినెట్.. ఎవరికి ఏయే శాఖలంటే?

Karnataka Congress

Karnataka Congress

Karnataka Congress: కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం లో పూర్తి స్థాయి క్యాబినెట్ కొలువు తీరింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా శనివారం మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్ పూర్తిగా సిద్ధమైంది.

రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో 23 మంది నూతన ఎమ్మెల్యేలుగా కాగా.. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించని ఎన్‌. ఎస్‌ బోస్‌రాజును క్యాబినెట్ లోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన జోస్‌రాజ్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచన మేరకు మంత్రి పదవి ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, సిద్దరామయ్య మంత్రి వర్గంలో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బెళగావి రూరల్‌ నియోజక వర్గం నుంచి రెండో సారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. ఈమెను క్యాబినెట్ లోకి ప్రతిపాదించారు.

ఎవరెవరంటే?(Karnataka Congress)

మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, మాజీ సీఎం ఆర్‌. గుండురావు తనయుడు దినేశ్‌ గుండు రావు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వర ఖండ్రేదతో పాటు పిరియాపట్టణ వెంకటేశ్‌, హెచ్‌.సి. మహదేవప్ప, భైరతి సురేశ్‌, శివరాజ్‌ తంగడిగి, ఆర్‌.బి.తిమ్మాపుర్‌, బి.నాగేంద్ర, డి.సుధాకర్‌, కృష్ణభైరేగౌడ, రహీంఖాన్‌, సంతోశ్‌లాడ్‌, కె.ఎన్‌.రాజణ్ణ, చలువరాయస్వామి, మంకుళ్‌ వైద్య, ఎం సి సుధాకర్‌, హెచ్‌ కె పాటిల్‌, శరణ్‌ప్రకాశ్‌ పాటిల్‌, శివానందపాటిల్‌, ఎస్‌ ఎస్‌ మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్‌ కూడా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు.

 

కీలక శాఖలు సిద్ధూ దగ్గరే..

మరో వైపు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు అయినా.. శాఖల కేటాయింపులపై అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఆర్థికశాఖ, క్యాబినెట్‌ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌ లాంటి కీలక శాఖలు సీఎం సిద్ధరామయ్య తన దగ్గరే ఉంచుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కు బెంగళూరు నగర అభివృద్ధితో పాటు, నీటి పారుదల శాఖలను కేటాయించినట్టు తెలుస్తోంది.

 

 

కాగా, పార్టీ సీనియర్ నేత జి. పరమేశ్వరకు హోం శాఖ, ఎస్ఎస్‌ మల్లికార్జునకు గనులు, భూగర్భ, హార్టికల్చర్ శాఖలు, దినేష్ గుండురావుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కృష్ణ బైరె గౌడకు రెవెన్యూ శాఖ కేటాయించనున్నట్టు సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు డవలప్‌మెంట్, పంచాయితీ శాజ్ బాధ్యత అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

 

 

Exit mobile version