Bodhan: మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.
మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి భారి మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన ఘనమైన చరిత్ర బీజేపీకి ఉంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ మహారాష్ట్ర, గోవా ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారు. బీజేపీ కుట్రలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టారు. తప్పుడు ఆరోపణలు చేయడం బీజేపీ నేతలకు, కేంద్రం ప్రభుత్వానికే చెల్లుతుంది. తెలంగాణలో హనుమాన్ గుడి లేని గ్రామం లేదు. కేసీఆర్ పథకాలు లేని ఇల్లు లేదు. తెలంగాణ రాష్ట్రం దేశంలో రోల్ మాడల్ గా నిలుస్తోందని షకీల్ అన్నారు.
టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.