Site icon Prime9

Minister Roja : రాష్ట్రపతి పర్యటనలో ’వాడిన రోజా‘

Minister Roja

Minister Roja

Minister Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజానోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. . కానీ మంత్రి అయిన తరవాత ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం లభిస్తోందా అంటే.. లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా రాష్ట్రపతి పర్యటన తిరుపతిలో రోజాకు మరోసారి అన్యాయం జరిగిందా? అంటే అవుననే అంటున్నారు. ఈ పర్యటనలో ఆమె పరిస్థితి `వాడిన రోజా`లా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమెను సొంత పార్టీ నాయకులు మంత్రులే పట్టించుకోలేదని పెద్ద ఎత్తున కామెంట్లు హల్చల్ చేస్తున్నాయి.

. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతిగా బాద్యతలు చేపట్టాక తొలిసారి ఏపీకి వచ్చారు. రెండు రోజుల పాటు పర్యటించారు. అయితే ఆమె ఒక ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి వెంట గౌరవార్థం ఉండాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాల మేరకు పర్యాటక మంత్రి ఆర్కే రోజా.. ఈ రెండు రోజులు రాష్ట్రపతి పర్యటనకే తన షెడ్యూల్ కేటాయించారు.

విజయవాడలో జరిగిన అన్ని కార్యక్రమాలు సహా విశాఖలో జరిగిన నేవీడే కార్యక్రమానికి కూడా రోజా హాజరయ్యారు. ఇక్కడ మంత్రిగా రోజాకు సమున్నత గౌరవమే దక్కింది. రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చిన విందులోనూ ఆమె పాల్గొన్నారు. అయితే.. సొంత జిల్లా తిరుపతిలో రాష్ట్రపతి పర్యటనలో మాత్రం రోజాకు ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు.తిరుమలలో రాష్ట్రపతి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె వెంట వచ్చిన కుటుంబ సభ్యురాలిని మాత్రమే లోపలికి పంపించి రోజాను తర్వాత పంపించారని అంటున్నారు.
ఇక తర్వాత జరిగిన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అసలు రోజాను ఎవరూ పట్టించుకోలేదట.దీనికి కారణం ఈ కార్యక్రమం అంతా కూడా రోజా ప్రత్యర్థిగా భావించే మరో మంత్రి, వైసీపీ కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా జరగడమే. దీంతో రోజాను విశ్వవిద్యాలయంలో ఎవరూ పట్టించుకోకపోగా.. వేదికపై కూడా కూర్చునే అవకాశం ఇవ్వలేదు. మహిళా రాష్ట్రపతి వస్తే మహిళా మంత్రికి స్టేజ్‌పై చోటు దక్కలేదు. దీంతో వేదిక కింద భాగంలో రెండో వరుసలో కూర్చున్నారు రోజా. కనీసం ఎక్కడా మాట్లాడే అవకాశం కూడా రాలేదు.

ఇక తిరుపతి విమానాశ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలికే కార్యక్రమంలోనూ రోజాకు ప్రాధాన్యం దక్కలేదని తెలుస్తోంది. ఆమె బదులు కార్యక్రమం అంతా కూడా మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపించారు. వీరిద్దరూ కూడా రోజాకు వ్యతిరేక వర్గంగానే ఉన్నారు. మొత్తానికి రోజాకు సొంత జిల్లాలోనే అవమానం జరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇంత దారుణమైన అవమానం రోజాకు జరగడంపై ఆమె అనుచరులు ఫీలవుతున్నారు. నగరి నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థి వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. మంత్రి పదవి ఇచ్చినా గౌరవం లేకుండా చేస్తున్నారు. భర్తతో కలిసి వెళ్లి మరీ జగన్ దగ్గర మొర పెట్టుకున్నా.. రోజాకు.. రిలీఫ్ కలగలేదు. కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప.. రోజా చేయగలిగిందేమీ లేదని వైసీపీ వర్గాలు కూడా లైట్ తీసుకుంటున్నాయి.

Exit mobile version