Site icon Prime9

Harirama Jogaiah: పవన్ కళ్యాణ్ సీఎం కావడమే నా కోరిక.. హరిరామ జోగయ్య

Harirama Jogaiah wish to pawan kalyan become CM

Harirama Jogaiah wish to pawan kalyan become CM

Harirama Jogaiah: నేను చేసే ప్రతి పని కూడా మీ ద్వారా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనేదే లక్ష్యంతోనే చేస్తున్నానని హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ తో అన్నారు. పవన్ ద్వారా కాపులు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మా తాపత్రయం అంతా మీరు సీఎం అవ్వడమే.. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా అల్టిమేట్ ధ్యేయం హరిరామ జోగయ్య తెలిపారు. మీరు ఏం చేద్దామంటే అదే చేద్దాం.. మీరు ఏం చెప్తే అదే చేద్దాం మీరు చెప్పండి అంటూ హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ తో అన్నారు. వైసీపీ మూర్ఖులు ఎలాగైనా దిగిరావాలని కాపులకు రిజర్వేషన్లను కల్పించాలనే ఈ దీక్ష చేపట్టానని ఆయన తెలిపారు.

దానికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ దీక్ష ద్వారా ప్రభుత్వం స్పందించదంటూ వారికి ఎంత చెప్పినా ఏం చేసినా దున్నపోతు మీద వాన కురిసినట్టే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ దీక్షను విరమించాలని ఆయన హరిరామ జోగయ్యను కోరారు. తమకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ అందరూ కలిసి ముందుకు వెళ్లేలా కార్యాచరణలు చేపడదామని పవన్ ఆయనతో చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ సూచన మేరకు హరిరామజోగయ్య తాజాగా దీక్షను విరమించారు.

harirama-jogaiah

అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లను కాపులకు ఐదు శాతం కేటాయించాలని కాపు ఉద్యమ నేత జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబర్ 30 తేదీ వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి జోగయ్య సమయం ఇచ్చారు. కాగా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జోగయ్య నిన్న రాత్రి నుంచి ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నట్టు ప్రకటించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు దీక్ష విరమించాలంటూ ఆయనను అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హరిరామజోగయ్యకు షుగర్‌ లెవెల్స్‌ తగ్గిపోతున్నాయని వైద్యం అందించేందుకు డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన నిరాకరిస్తున్నారని సమాచారం అందడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. 85 ఏళ్ల వయస్సులో ఆయన దీక్ష చేపట్టడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని పవన్‌ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లారు. అందరం కలిసి చర్చించి ప్రభుత్వంపై నిరసను వెళ్తామని ఇలా ఒక్కరే పట్టుపట్టవద్దని పవన్ ఆయనను కోరారు.

Exit mobile version