Congress presidentship: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై ఉత్కంఠత

దశాబ్ధాల పార్టీ చరిత్రతో చేపట్టనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బరిలో ఎవరననే అంశంపై చర్చ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పార్టీలో ప్రక్షాళనతో పాటుగా ఎన్నికలు పారదర్శకంగా చేపట్టేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టి సారించడంతో అధ్యక్ష సీటుగా పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.

Thiruvanathapuram: దశాబ్ధాల పార్టీ చరిత్రతో చేపట్టనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బరిలో ఎవరననే అంశంపై చర్చ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పార్టీలో ప్రక్షాళనతో పాటుగా ఎన్నికలు పారదర్శకంగా చేపట్టేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టి సారించడంతో అధ్యక్ష సీటుగా పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో గాంధీయేతర నేతలు కూడా అధ్యక్ష పదవి పై ఓ కన్నేసారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన మీడియా కార్యదర్శ జైరాం రమేష్ తిరువనంతపురంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అక్టోబర్ 17న జరిగే కాంగ్రెస్ అధ్యక్ష పోటీల్లో ఎవరు ఎన్నికైనా అందరి నేతగా సోనియా గాంధీ కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సైద్ధాంతిక దిక్సూచిగా ఉంటారని జైరాం చెప్పడం బట్టి చూస్తే పార్టీలో సీనియర్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కు అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. నూతన అధ్యక్షుడిపై ఏకాభిప్రాయం ఉండాలన్న జైరాం, ఇతరులు అధ్యక్ష పదవి చేపడితే రాహుల్ గాంధీ సర్దుకుపోయే గొప్ప ప్రజాస్వామికవాదిగా పేర్కొనడం గమనార్హం. మరో వైపు రాహుల్ గాంధీ కూడా భారత జోడో యాత్ర ప్రారంభం సమయంలో ఎన్నికలపై వేచి చూడండి అని చెప్పడం బట్టి చూస్తూ ఇతరులకే కాంగ్రెస్ అధ్యక్ష సీటు అని అందరికి అర్ధ మౌతుంది. పార్టీలోని అధిష్టాన సంస్కృతిపై మాట్లాడిన జైరాం రమేష్ అధిష్టానం అనే మాటలు లేని పార్టీ అరాచకమౌతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో తీరిక లేకుండా గడుపుతున్న కాంగ్రెస్ అధిష్టాన వర్గం రాజస్థాన్ సీఎం గెహ్లాట్ వ్యవస్థలో చురుగ్గా వ్యవహరించగలరని, కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నత స్థాయి హుందాతనంగల నేత అని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గెహ్లాట్ కూడా ఆ పదవిని చేపట్టేందుకు సుముఖంగానే ఉన్నారు.

ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్ష పదవిని ఏక కాలంలో నిర్వహించడానికి వీలుండదు కాబట్టి, ఈ నెల 24 నుంచి 30 మధ్యలో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తే, ముఖ్యమంత్రి పదవిని ఆయన వదులుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. అధ్యక్ష పదవికి పోటీ ఉంటే, అభ్యర్థులు ప్రదేశ్ కాంగ్రెస్ డెలిగేట్స్‌ను ప్రభావితం చేయగలిగే అధికార పదవుల్లో ఉండకూడదు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించవలసి ఉంటుంది. ఆయన కుమారుడు వైభవ్‌కు కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తామని, గహ్లోత్ కు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తామని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

జీ23 నేతల్లో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పలు విమర్శలు గుప్పించినా, మిగిలిన నేతలంతా చురుగ్గానే పార్టీలో ఉన్నారు. బరిలో నిలవడానికి ప్రజాస్వామిక, చట్టపరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ తప్పదనిపిస్తోంది.