Site icon Prime9

BRS meeting in Khammam: సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఎక్కడుంది.. కేంద్రాన్ని ప్రశ్నించిన సీపీఐ నేత డి. రాజా

d.raja comments on bjp govt brs meeting in khammam

d.raja comments on bjp govt brs meeting in khammam

BRS meeting in Khammam: ఖమ్మం వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ సభలో సీపీఐ జాతీయ నేత డి. రాజా కేంద్రం పై విరుచుకుపడ్డారు.

రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం గవర్నర్లతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు.

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు.

భాజపా నేతలు చెప్తున్నట్టు సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఎక్కడుందని డి. రాజా ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

బీజేపీ వన్ పార్టీ వన్ లీడర్ విధానంతో వెళ్తుందని ఆయన ఆరోపించారు.

మోదీ ప్రభుత్వం రాష్ట్రాల సమస్యలను పట్టించుకోకుండా అదాని, అంబాని వంటి కార్పొరేట్ బడా బాబులకు రెడ్ కార్పెట్ వేస్తోందని డి. రాజా విమర్శించారు.

పార్టీలు ఏకం కావాల్సిన టైం ఇది..

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేందుతోందని ఆయన కేసీఆర్ సర్కారుపై ప్రశంసల వర్షం కురిపించారు.

విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రస్తుత కాలంలో కలిసి పోరాడితే కానీ దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితి నెలకొనిందని ఆయన తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని.. సెక్యూలర్ పార్టీలన్నీ కలిసి దేశానికి విముక్తి కలిగించాలని డి. రాజా పేర్కొన్నారు.

ఖమ్మం వేదిక(BRS meeting in Khammam)గా అటు జాతీయ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి బలోపేతం అవ్వాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తోన్నారు.

కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా మారాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కూడా ఇదే కావడం విశేషం.

ఇక ఈ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరు అవుతుండటం రాజకీయ వర్గాల్లో ఈ సభ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈసభలో పాల్గొనడానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పినరయి విజయన్, అఖిలేష్, పంజాబ్ సీఎం, డి రాజా తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు.

జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యామ్నాయంగా మారుతుందని మొదటి నుంచి కేసీఆర్‌ చేప్తూనే వచ్చారు.

కాగా ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా ఖమ్మం వేదికగా కేసీఆర్ గట్టి సందేశాన్ని ఇవ్వనున్నారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు,

దానిని నడిపే శక్తి బీఆర్‌ఎస్‌కు ఉందనే సంకేతాలను ఈ సభ ద్వారా కేసీఆర్‌ ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version