Khammam: బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు.. ఖమ్మం వేదికైంది. ఈ సభ కోసం బీఆర్ఎస్ భారీగా ఖర్చు చేస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇక సభాస్థలి వేదికను సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నారు. దీంతో ఖమ్మం (Khammam) మెుత్తం గులాబీమయంగా మారిపోయింది.
భారాస ఆవిర్భావ సభకు ఖమ్మం ముస్తాబైంది. ఈ వేదికను బీఆర్ఎస్ శ్రేణులు సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
ఖమ్మంలో ఎటు చూసిన గులబీ జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో గులాబీమయం సంతరించుకుంది.
ఖమ్మం వ్యాప్తంగా దాదాపు రూ. 2 కోట్ల వరకు వీటీ కోసమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సభా వేదికకు ఎదురుగా ఏర్పాటు కటౌట్లు అందరిని ఆకర్షిస్తున్నాయి.
కేసీఆర్ Cm Kcr కేజ్రీవాల్, పినరయి విజయన్, అఖిలేష్ యాదవ్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.
ఈ సభ కవరేజీ కోసం మీడియా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
బుధవారం జరిగే సభకు సోమవారం నుంచే పార్టీ ముఖ్యనేతలు వస్తున్నారు.
సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి హరీష్ రావు వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నారు.
సభకు ముందే మంత్రులు ఇక్కడికి చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
సభకు ఒక్కరోజు ముందే బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఖమ్మం చేరుకుంటున్నారు.
ముఖ్య నాయకులంతా ఖమ్మం రావడంతో.. హోటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక్కడి నుంచే కేసీఆర్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
దీంతో వైద్యశాఖ అధికారులు ముందుగానే చేరుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఇక్కడికి రానుండటంతో ఖమ్మం నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
సభావేదిక అలంకరణ, ముఖ్యనేతల సీటింగ్‌పై మంత్రి హరీష్ రావు నేతలకు దిశానిర్దేశం చేశారు.
వేదిక వద్ద సీఎంల కాన్వాయ్ పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్టీ ముఖ్యనేతలు కూర్చునేందుకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. వీటిని మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
బీఆర్ఎస్ భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్ననేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్న జిల్లా పోలీసులు.
పోలీసులు సూచించిన ప్రాంతాల్లోనే వాహనాల పార్కింగ్ చేయాలని వినతి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/