Prime9

Brs Meeting: భారాస ఆవిర్భావ సభ.. ఐదు లక్షల మంది వీక్షించేలా ప్రాంగణం

Brs Meeting: భారాస ఆవిర్భావ సభకు ఖమ్మం వేదికైంది. కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా మారాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడం విశేషం. ఇక ఈ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరు అవుతుండటం రాజకీయా వర్గాల్లో ఈ సభ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పినరయి విజయన్, అఖిలేష్, పంజాబ్ సీఎం, డి రాజా తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ముఖ్య నేతలంతా యాదాద్రి వెళ్లనున్నారు. అక్కడ దర్శనం అనంతరం నేరుగా ఖమ్మం చేరుకుంటారు.

 

పార్టీ ఆవిర్భావం అనంతరం తొలి సభ ఇదే కావడంతో దేశ నాయకుల దృష్టి ఈ సభా మీదే కేంద్రీకృతమైంది. సుమారు ఈ సభకు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభ వేడుకలు మంగళవారమే పూర్తి అయ్యాయి. ఈ సభలో ముఖ్యంగా.. పార్టీ జాతీయ ఎజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇక దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా పార్జీ ఎజెండాను సైతం కేసీఆర్ వెల్లడించనున్నారు. ఈ వేదిక పైనుంచి ఆరు రాష్ట్రాల పార్టీ శాఖలు.. రైతు విభాగాలను కేసీఆర్ తెలపనున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఈ సభకు రాలేకపోతున్నారు. తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ భారాసలో విలీనానికి సిద్దమైంది.

ముందుగా ఈ సభను ఢిల్లీలో నిర్వహించాలని కేసీఆర్ అనుకున్నారట.

అనంతరం.. తొలిదశ ఉద్యమానికి పునాది వేసిన ఖమ్మంలోనే బాగుంటుందని నిర్ణయించారట.

దీంతో హరీష్ రావు రంగంలోకి దిగి.. సభ పనులను చూసుకున్నారు.
మరో మంత్రి పువ్వాడ అజయ్‌.. ఇతర నాయకులు సభ ఏర్పాట్లలో పాల్గొన్నారు.

ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై గల వెంకటాయపాలెంలో ఈ సభ నిర్వహిస్తున్నారు.

సుమారు 70 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తుండగా ప్రధాన వేదికను జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు.

వేదికపై సీఎం ల చిత్రపటాలతో రూపొందించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేదికకు ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేశారు.

ప్రధాన నేతల ప్రసంగాలను వీక్షించేందుకు ప్రత్యేక తెరలను ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదిక ఎడమవైపు కళాకారుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు.

 

యాదాద్రిలో దర్శనాల నిలిపివేత

ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ నేరుగా యాదాద్రి వెళ్లనున్నారు.

అక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం.. సీఎం కేసీఆర్ ఇతర సీఎంలు నేరుగా ఖమ్మం వెళ్లనున్నారు.

నూతన కలెక్టరేట్ ప్రారంభించాక.. కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత సభా వేదిక వద్దకు కేసీఆర్ వెళ్లనున్నారు.

ఈ రోజు కార్యక్రమాలు అధికంగా ఉండటంతో సభా షెడ్యూల్ ను గంట ముందుకు జరిపినట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది.

BJP Leaders : బీజేపీకి తలనొప్పి నేతలు వీళ్లే | Prime9 News

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar