MP Avinash Reddy: సుప్రీంకోర్టులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది.వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని సుప్రీంకోర్టు రద్దు చేసింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది.
జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలి..( MP Avinash Reddy)
తెలంగాణ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు పూర్తిగా పక్కనబెట్టింది.తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ఉత్తర్వులవల్ల సిబిఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు తుది గడువుని జూన్ 30 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకూ అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేసింది. హైకోర్టు అలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని తెలిపింది. అటువంటి ఉత్తర్వుల వలన సీబీఐ దర్యాప్తు పై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని మీరు ఎందుకు ఊహిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే సీబీఐ అవినాష్ రెడ్డిని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేదని పేర్కొంది. విచారణ సమయంలో అవినాష్ రెడ్డికి లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం కూడ కరెక్టు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.