Tarakaratna Health: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. బాలకృష్ణ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మరింత మెరుగైన వైద్యం కోసం.. తారకరత్నను బెంగళూరు తరలిస్తే బావుంటుందని వైద్యులు సూచించారని ఈ సందర్భంగా అన్నారు.
ప్రస్తుతం తారకరత్న బీపీ 120/80 ఉందని.. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయిందని బాలకృష్ణ తెలిపారు. తారకరత్నకు ప్రస్తుతం ఎలాంటి స్టంట్లు వేయలేదని.. వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారని వివరించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. తారకరత్న ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. తారకరత్న ఆరోగ్యంపై.. చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు బాలకృష్ణ మీడియాకు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు వెళ్తే మంచిదని వైద్యులు సూచించారు. బెంగళూరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు బాలయ్య పేర్కొన్నారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య పర్యవేక్షిస్తున్నారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గురయ్యారు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ పాదయాత్ర చేపట్టారు.
కుప్పంలో నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో.. తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.
ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే గమనించిన తెదేపా కార్యకర్తలు ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి లేదా బెంగళూరు ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలుస్తుంది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన జూనియర్ ఎన్టీఆర్.
బాలకృష్ణకు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులు తెలుసుకున్న ఎన్టీఆర్.
కుప్పం నియోజకవర్గంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి యువగళం యాత్ర ప్రారంభమైంది.
ఈ యాత్రలో నటుడు తారకతర్న కూడా పాల్గొన్నారు. ఈ పాదయాత్ర ప్రారంభమైన కాసేపటికే.. లోకేష్ మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్ తో పాటు తారకరత్న కూడా అందులో పాల్గొన్నారు.
మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు.
ఆ సమయంలోనే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/