Shriya Saran : ఇష్టం సినిమాతో తెలుగు సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది “శ్రియ శరన్”. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో జతకట్టి.. బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ బ్యూటీ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌ని వివాహం చేసుకుంది. చాలా సీక్రెట్ గా తనకో పాప పుట్టిందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిన ఈ భామ.. మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే శ్రియ తన లేటెస్ట్ ఫోటో లతో ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది. ఆ ఫోటోలు మీకోసం ప్రత్యేకంగా..