Suhana Khan : బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె “సుహానా ఖాన్” గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పటి వరకు వెండి తెరకు ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్ స్టా వేదికగా ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వనుంది సుహానా. అయితే హీరోయిన్ అవ్వకముందే సుహానా ఖాన్ ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా దీపావళి సందర్భంగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.