Sai Pallavi : టాలీవుడ్ కి “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తక్కువ సమయం లోనే ప్రేక్షకుల ఆదరణ పొంది.. ఎలాంటి గ్లామర్ షో లేకుండా పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను అలరిస్తుంది సాయి పల్లవి. వరుస సినిమాలలో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్న ఈ భామ.. లేడి పవర్ స్టార్ అని పిలిపించుకుంటుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే సాయి.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.