Priyanka Mohan : “ప్రియాంక అరుళ్ మోహన్”.. న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ .` అందం, అభినయంతో మొదటి సినిమాతోనే యువత అందర్నీ ఫిదా చేసిన ఈ భామ.. వారి హృదయాలను కొల్లగొట్టేసింది. అయితే ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో టాలీవుడ్ లో హవా కొనసాగించడం ఖాయమని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత శర్వానంద్ తో ‘శ్రీకారం’ సినిమా చేయగా అది ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది ఈ భామ. ఇక శివ కార్తికేయన్ సరసన ‘డాక్టర్’ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న ప్రియాంక, అక్కడ తన జోరు చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ – సుజీత్ కాంబినేషన్లోని OG సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది . అలానే ధనుష్ “కెప్టెన్ మిల్లర్” మూవీలో కూడా నటిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ చీరలోని ఫోటోలతో యూత్ ని ఫిదా చేస్తుంది.