Parineeti Raghav: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దాలు ప్రేమలో ఉన్నారని, త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే న్యూస్ బీటౌన్ లో బాగా చక్కర్లు కొట్టింది.
సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తులా హౌస్ లో ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్ర కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పరిణీతి నిశ్చిత్తార్థానికి హాజరయ్యేందుకు ప్రియాంక చోప్రా శనివారం ఉదయమే ఢిల్లీకి వచ్చింది. ఎంగేజ్ మెంట్ విషయాన్ని తెలియజేస్తూ పరిణీతి, రాఘవ్ లు తమ ఇన్ స్టాలో వేడుక ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి.