Neha Sharma : టాలీవుడ్ లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుత సినిమా తర్వాత వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రంలో కూడా ఈమె అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా ఆడకపోవడంతో నేహా శర్మ కు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తెలుగు సినిమాలో ఈ ముద్దు గుమ్మ కనిపించక చాలా రోజులే అయింది. అయితే ఈ అందాల తారకు మూవీ ఆఫర్స్ రాకపోయినా..కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో రచ్చ లేపుతుంది.