Nandini Rai : ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ “నందిని రాయ్” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అంతర్జాతీయ మోడల్ గా పేరు తెచ్చుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ గా కిరీటం దక్కించుకుంది. అలాగే 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా కూడా విన్నర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేయాలని ” 040 ” అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మాయా, ఖుషీ ఖుషీగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి సినిమాల్లో నటించింది. అలానే బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన హాట్ ఫోటోలతో యూత్ ఓ మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.