Nabha Natesh : “నభా నటేష్”.. సుధీర్ బాబు హీరోగా “నన్ను దోచుకుందువటే” సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రిలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయిన ఈ అమ్మడు … డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు వరుస పరాజయాలు కావడంతో రేస్ లో వెనుక బడిందని చెప్పాలి. ఇటీవల యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు రికవర్ అయ్యాక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే నభా తన వెర్షన్ ని మార్చి అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటూ రెచ్చిపోతుంది. ఆ ఫోటోలు మీకోసం ప్రత్యేకంగా..