Mirna Menon : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైలర్. ఈ సినిమాలో రజినీ కోడలిగా నటించి మెప్పించింది “మిర్నా మీనన్”. ఈమె అసలు పేరు అదితి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆమె.. 2016 లో ఆమె తన కెరీర్ ను పట్టదారి అనే సినిమాతో ప్రారంభించింది. ఆ తరువాత పలు సినిమాలు చేసినా మోహన్ లాల్ నటించిన బిగ్ బ్రదర్ సినిమాలో ఒక పాత్రలో నటించడంతో మంచి పేరు వచ్చింది. ఇక తెలుగులో ఆది సాయి కుమార్ నటించిన క్రేజీ ఫెలో, అల్లరి నరేష్ తో ఉగ్రం సినిమాలలో నటించింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మ హాట్ లుక్ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.