Site icon Prime9

Kriti Sanon: సీతమ్మ పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నా- కృతి సనన్

Kriti Sanon

Kriti Sanon

Kriti Sanon: రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవ దత్తా, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జానకి పాత్ర నన్ను సెలెక్ట్ చేసినందుకు ఆనందంగా ఉంది. సీతమ్మ పాత్ర పోషించినందుకు అదృష్టంగా భావిస్తున్నట్టు కృతి సనన్ తెలిపింది.

Exit mobile version