KL Rahul And Athiya Shetty Wedding: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పెళ్లిపీటలెక్కనున్నాడు.
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు ప్రముఖ నటి అతియా శెట్టి, రాహుల్ గత నాలుగేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
కాగా, ఈ రోజు వారిరువురు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఏడడుగులు వేసి మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారు.
అతి కొంత బంధువులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం(KL Rahul And Athiya Shetty Wedding) జరిగేలా సునీల్ శెట్టి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాడు.
ముంబైలోని సునీల్ శెట్టి నివాసమైన ఖండాలాలోని ఫామ్ హౌస్ జహన్ లో వీరిరువురి వివాహం జరగనుంది.
ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఇక వీరిపెళ్లిలో దక్షిణాది రుచులను వడ్డించనున్నారు.