CSK vs RR Highlights: ఐపీఎల్ 2023లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్ చూసేందుకు తారాగణంతా కదిలివచ్చింది. ఓ వైపు ధోనీ మెరుపు ఇన్నింగ్స్ మరోవైపు తళుక్కుమన్న తారలతో చెపాక్ స్టేడియం సందడిగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో సంజూ సేన అద్భుతం చేసిందనే చెప్పుకోవాలి. దాదాపు మ్యాచ్ సీఎస్కే చేతుల్లోకి వెళ్లింది అనుకున్న తరుణంలో ఆఖరి బంతి వరకు ఊరించి విజయాన్ని ఆర్ఆర్ టీం లాగేసుకుంది. దీంతో 3 పరుగులతో ధోని సేనపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు నమోదు చేసుకుంది.