Anasuya Bharadwaj : బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు. ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ యాంకర్ కు ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.