Alia Bhatt : బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు ప్రేమించిన బ్యూటీ.. పెళ్ళి చేసుకుని.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక తన పాప కోసం దాదాపు 2 ఏళ్ళు.. సినిమాలకు విరామం ప్రకటించింది ఆలియా భట్. అటు రణ్ బీర్ కూడా తన పాపతో టైమ్ స్పెండ్ చేయడం కోసం కొంత కాలం సినిమాలకు విరామం ప్రకటించాడు. అయితే ఆలియా భట్ పెళ్ళీ పిల్లల తరువాత కూడా ఏ మాత్రం చెరగని అందంతో మెరిసిపోతోంది. తాజాగా న్యూయార్క్ సిటీలో జరుగుతున్న మెట్ గాలా 2023 వేడుకల్లో ప్రత్యక ఆకర్షణగా నిలిచింది ఆలియా భట్. ఆ ఈవెంట్ లో ఆమె వైట్ గౌన్ లో ప్రత్యేకంగా నిలిచింది. దాదాపు లక్ష ముత్యాలతో రూపొందించిన ఈ లాంగ్ ఫ్రాక్.. ఆలియా భట్ ధరించి కార్పెట్ పై నడిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.