Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ… ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో సందడి చేసి అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రగ్యా జైశ్వాల్ బాలయ్యతో కలిసి చేసిన … అఖండ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అఖండ సినిమా విజయంతో ఈ ముద్దుగుమ్మ జోష్ లో ఉంది. ఇటు ప్రగ్యా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.