Meenakshi Chaudhary : టాలీవుడ్ కి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది “మీనాక్షి చౌదరి”. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి, అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గానే విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ అవుతున్న హీరోయిన్స్ లో ఈ భామ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదని చెప్పాలి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న “గుంటూరు కారం” మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ వైపు అడుగులు వేస్తుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తహన లేటెస్ట్ ఫోటో ఘాట్ లతో ఫాలోయింగ్ పెంచుకొనే పనిలో ఉంది.