Divya Bharathi : తమిళ “బ్యాచిలర్” సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు “దివ్య భారతి”. తన సొగసైన అందాలతో ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేసిన ఈ భామ ఒక్క సినిమాతో అమాంతం క్రేజ్ పెంచుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వచ్చిన ఆ సినిమా అంతా క్రేజ్ తెచ్చి పెట్టలేదని చెప్పుకోవాలి. తన రెండో చిత్రంగా ‘మధిల్ మెల్ కాదల్’ అనే తమిళ సినిమాలో నటించింది. ఇప్పుడు మూడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. సుడిగాలి సుధీర్ సరసన ఒక సినిమాలో నటిస్తుంది. అలానే సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటోలతో యూత్ లో ఫుల్ క్రేజ్ పెంచుకుంటున్న ఈ బ్యూటీ.. తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇక లేటెస్ట్ గా బీచ్ లో తన అందాలను ఆరబోస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.