Site icon Prime9

CM Kejriwal:మీకు బెయిల్ ఇస్తే అధికార పత్రాలపై సంతకాలు చేయరాదు ..సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు సూచన

Arvind Kejriwal

Arvind Kejriwal

CM Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బెయిల్‌ కోసం చేసుకున్న దరఖాస్తుపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదోపవాదాలు జరిగాయి. లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తనకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. కాగా లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా కోర్టు కూడా కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ఉద్దేశం పూర్వకంగా నేరాలు చేసే వ్యక్తి కాదని మధ్యంతర బెయిల్‌ వాదోపవాదాల సందర్భంగా కోర్టు కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

కేజ్రీవాల్‌ కావాలని నేరాలు చేసే వ్యక్తి కాదు..(CM Kejriwal)

ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు గత వారం కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఎందుకు అని కోర్టు ఈడీని ప్రశ్నించింది. కేజ్రీవాల్‌ వ్యక్తిగత స్వేచ్చ కూడా ముఖ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. ఒకానిక దశలో కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇస్తామని ఈడీ చూచాయిగా తెలిపింది. కాగా ఢిల్లీ లోకసభకు మే 25న పోలింగ్‌ జరుగనుంది. ఇదిలా ఉండగా కోర్టులో జరిగిన వాదోవవాదాల సందర్భంగా కోర్టు కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ఆయన ప్రజలచే ఎన్నికోబడిన ముఖ్యమంత్రి ..ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొందని.. అదీ కాకుండా కేజ్రీవాల్‌ కావాలని నేరాలు చేసే వ్యక్తి కూడా కాదు అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, దీపాంకర్‌దత్తాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికలు లేకపోతే మధ్యంతర బెయిల్‌ ప్రస్తావనే ఉండదని దత్తా అన్నారు. ప్రజాప్రయోజనార్థం ఈ కేసు విచారిద్దామని తన సహచరుడు చెప్పాడని జడ్జి దత్తా అన్నారు.

అయితే సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు ఓ వార్నింగ్‌ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో కీలకపాత్ర పోషించిందని ఈడీ ఆరోపిస్తోంది. ఒక వేళ మిమ్మల్ని బెయిల్‌పై విడుదల చేస్తే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అనుమతిస్తే.. అదే సమయంలో మీరు అధికార విధులు నిర్వర్తిస్తే.. వ్యతిరేక ప్రభావం చూపుతుందని కోర్టు హెచ్చరించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ న్యాయవాది అభిషేక్‌ మనేసింఘ్వీ జోక్యం చేసుకుంటూ తన క్లయింట్‌ ఎక్సైజ్‌ కేసుకు సంబంధించి ఆయన దూరంగా ఉంటారని అన్నారు. ఒక వేళ మీరు మధ్యంతర బెయిల్‌ ఇస్తే అధికార కార్యక్రమంలో పాల్గొనమని స్పష్టం చేశారు. రోజు వారి ప్రభుత్వం కార్యక్రమాలకు దూరంగా ఉంటామని హామీ ఇచ్చారు. కావాలంటే కోర్టుకు హామీ పత్రం ఇస్తామని .. ఫైల్స్‌పై సంతకాలు చేయమని రాసిస్తామని అన్నారు.

బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ..

అయితే కేజ్రీవాల్‌ బెయిల్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈడీ తరపున వాదిస్తున్న ఎస్‌వీ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకు బెయిల్‌ ఇవ్వాలా అని కోర్టును ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని అన్నారు. కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారం అంత ముఖ్యమా అని ప్రశ్నించారు. నేరాలకు పాల్పడిన రాజకీయ నాయకులను ప్రత్యేకంగా ట్రీట్‌ చేయడం ఏమిటని కోర్టును ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు సుమారు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోలేదు. ఇపుడు అరెస్టు చేస్తే ఎన్నికలకు ముందు అరెస్టు చేశారని ఆప్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తోందిన ఈడీ కోర్టులో వాదించింది. కోర్టు ఆర్డర్‌ను పెండింగ్‌లో ఉంచింది.

 

Exit mobile version